కన్నడ నటి రుక్మిణీ వసంత్ మరో తెలుగు సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘కాంతార 1’ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బ్యూటీ. మరి శర్వానంద్ సరసన ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందట. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది.
దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కథ విషయానికి వస్తే.. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. అన్నట్టు ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. స్క్రిప్ట్ అయితే చాలా బాగా వచ్చిందట.


