ఫస్ట్ టైం ఇలాంటి రోల్ లో కనిపించనున్న సాయి పల్లవి!?

ఫస్ట్ టైం ఇలాంటి రోల్ లో కనిపించనున్న సాయి పల్లవి!?

Published on Jun 10, 2026 11:01 PM IST

Sai-Pallavi

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏక్ దిన్ అనే బాలీవుడ్ సినిమాతో పలకరించింది కానీ బాలీవుడ్ లో ఆమెకి డిజాస్టర్ వెల్కమ్ దక్కింది. అయితే ఇప్పుడు వరకు పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన సాయి పల్లవి ఈసారి కొంచెం డెప్త్ అండ్ ఇంటెన్స్ ఉండే రోల్ లో కనిపించనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఆమె ధనుష్ తో చేయనున్న నెక్స్ట్ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది అన్నట్టు సమాచారం. ఇది ఫ్యాన్స్ కి ఒకింత సర్ప్రైజింగ్ అంశమే అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండగా మోహన్ లాల్ కీలక క్యామియోలో నటిస్తున్నారు. అలాగే సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు