“సలార్ 2” నిలిపివేత? మేకర్స్ నుంచి వచ్చేసిన క్లారిటీ

“సలార్ 2” నిలిపివేత? మేకర్స్ నుంచి వచ్చేసిన క్లారిటీ

Published on May 26, 2024 10:40 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ సెన్సేషనల్ హిట్ అలాగే తన కం బ్యాక్ హిట్ చిత్రం “సలార్”. మళయాళ స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. మరి బాక్సాఫీస్ దగ్గర 700 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టిన ఈ చిత్రంకి కొనసాగంపు గా “సలార్ 2″/ సలార్ శౌర్యంగ పర్వం ఉందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

అయితే తాజాగా కొన్ని ఊహించని రూమర్స్ సలార్ 2 ఆగిపోయింది అని, మేకర్స్ ఇప్పట్లో సీక్వెల్ స్టార్ట్ చేసే యోచనలో లేరంటూ గాసిప్స్ వచ్చాయి. అయితే దీనిపై ఇప్పుడు మేకర్స్ నుంచి సాలిడ్ క్లారిటీ వచ్చేసింది. వాటిపైనే స్పందిస్తున్నట్టుగా ప్రశాంత్ నీల్, ప్రభాస్ లు సెట్స్ నుంచి నవ్వుకుంటున్న పిక్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. దీనితో సలార్ 2 ఆగింది అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో ఫ్యాన్స్ కి కూడా కొంచెం టెన్షన్ తప్పింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు