సమంత విజయ్ సినిమా నుండి తప్పుకుందా?

Published on Mar 7, 2020 12:02 pm IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ ఏడాది జాను గా ప్రేక్షకులను పలకరించింది. సినిమా ఫలితం సంగతి ఎలా ఉన్నా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. సమంత ప్రస్తుతం సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ సెకండ్ సీజన్లో నటిస్తుంది. అలాగే మరో రెండు చిత్రాలలో కూడా సమంత నటిస్తుంది. కాగా విజయ్ సేతుపతి సినిమాను నుండి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు విగ్నేష్ శివన్, విజయ్ సేతుపతి తో ఓ తమిళ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ఒకరు నయనతార కాగా మరొకరు సమంత. ఈ ప్రాజెక్ట్ నుండి సమంత తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కారణాలేమైనా సమంత ఈ ప్రాజెక్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నారట. మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More