త్వరలోనే అఫీషియల్ గుడ్ న్యూస్ తో సామ్!?

త్వరలోనే అఫీషియల్ గుడ్ న్యూస్ తో సామ్!?

Published on Jun 20, 2026 11:40 PM IST

samantha

చాలా కాలం విరామం తర్వాత తెలుగు సినిమా దగ్గర తన కొత్త సినిమాతో హీరోయిన్ సమంత నటించిన ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా కంబ్యాక్ గా వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమానే మా ఇంటి బంగారం. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా క్రేజీ ఓపెనింగ్స్ రాబట్టి ఇప్పుడు సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుంది.

ఇదే సమంత ఫ్యాన్స్ కి గ్రేట్ న్యూస్ అనుకుంటే అతి త్వరలోనే సమంత అలాగే తన భర్త రాజ్ నిడుమోరులు ఓ శుభవార్త అందించనున్నారు అని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. తాజాగా సమంతకి చెందిన కొన్ని విజువల్స్ వైరల్ గా మారాయి.

ఇందులో ఆమె బేబీ బంప్ తో కనిపించడంతో ఆమె గర్భంతో ఉందని అర్ధం అవుతుంది. ఇక దీనిపైనే ఆమె త్వరలోనే ఓ అధికారిక ప్రకటన కూడా ఇవ్వొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. సో మొత్తానికి సమంత ఫ్యాన్స్ కి మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఇవి గుడ్ న్యూస్ లు అని చెప్పవచ్చు.

తాజా వార్తలు