శంకర్ ఇంట్రెస్ట్ చరణ్ తో ప్రాజెక్ట్ మీదే ఉందా.?

Published on May 27, 2021 3:00 pm IST

జస్ట్ అనౌన్సమెంట్ తోనే సెన్సేషన్ ను నమోదు చేసిన పలు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ ల కాంబోలో అనౌన్స్ చేసిన బెంచ్ మార్క్ చిత్రం కూడా ఒకటి. అయితే ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచి అంచనాలు మరింత పెంచుకుంటూ వస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

అయితే దీనికి ముందు శంకర్ చేసిన ఇండియన్ 2 కంప్లీట్ చెయ్యాల్సి ఉంది. కానీ అది కాస్త గత కొన్ని రోజులు నుంచి వివాదాలలో నడుస్తుంది. కానీ ఇపుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే శంకర్ ఇంట్రెస్ట్ మాత్రం చరణ్ తో సినిమాపైనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇండియన్ 2 సినిమా బ్యాలన్స్ షూట్ శంకర్ నే చేస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. సో ఈ రెండు భారీ చిత్రాల విషయంలో ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :