చరణ్ కొత్త సినిమా ప్రకటన చేయనిది అందుకేనా?

Published on May 30, 2020 5:25 pm IST


ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. మార్చి నెలలో చరణ్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ ని రాజమౌళి సరికొత్తగా చూపించనున్నాడు అని అర్థం అవుతుంది. 2009లో వీరిద్దరి కాంబినేషన్ లో మగధీర రాగా మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ కోసం కలిసి పని చేస్తున్నారు.

రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తరువాత చేయనున్న మరో చిత్రాన్ని ప్రకటించలేదు. దానికి కారణం ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పటికే ఫిక్స్ అయ్యిందని ఓ వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివతోనే రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ చేయనున్నారట. ఆర్ ఆర్ ఆర్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఈ మూవీ ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక కొరటాల చిరంజీవితో ఆచ్యార చేస్తుండగా, అందులో ఓ కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More