బాలయ్య సినిమాకి అందుకే ఆ టైటిల్ ?

బాలయ్య బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. పవర్‌ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో ఓ సామాజిక అంశం గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని.. అందుకే ‘కార్పెంటర్’ అనె టైటిల్ ను సినిమాకి పెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇక సామాజిక సందేశంతో పాటు బాలయ్యకు తగ్గ భారీ యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయట.

కాగా ఆగస్టు చివరి వారం నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ మొదలుకానుంది. ఆ షెడ్యూల్ లో బాలయ్య పై భారీ యాక్షన్ సన్నివేశాలు తీయబోతున్నారు. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే సుమారు 20 రోజులకు పైగా షూటింగ్ సాగనుంది. ఇక కొరటాల శివ సినిమా అనగానే.. కథ కంటే కూడా కథా నేపథ్యమే ఎక్కువగా గుర్తుకొస్తోంది.

ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉంది. నేపథ్యం చుట్టూ.. ఆ ప్రాంతపు జీవన శైలిని సైతం కొరటాల, తన సినిమాలో చాలా బలంగా చూపిస్తారు. పైగా దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version