‘సూరరై పొట్రు’ హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా ?

‘సూరరై పొట్రు’ హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా ?

Published on Feb 13, 2024 1:14 AM IST

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా మూవీ సూరరై పొట్రు. తెలుగులో ఆకాశం నీహద్దురా టైటిల్ తో రిలీజ్ ఈ మూవీలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించారు. 2020 నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీని స్టార్ట్ అప్ అనే వర్కింగ్ టైటిల్ తో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా సుధా కొంగర తీస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ మూవీ జులై 2న రిలీజ్ కానుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అయితే దీని పై మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది. ఇంకా ఈ మూవీలో పరేష్ రావల్, రాధికా మదన్ కీలక పాత్రలు చేస్తుండగా జ్యోతిక, సూర్య, అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు