ప్రస్తుతం మన తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 చివరికి వస్తుంది. దీనితో కేవలం ఒక్కో రోజుతోనే కీలక పరిణామాల మూలాన హౌస్ లో ప్రవర్తనలు మారిపోతున్నాయి. దీనితో బిగ్ బాస్ వీక్షకుల్లో కూడా వారిపై ఉన్న అంచనాలు కూడా తారు మారు అవుతున్నాయి.
మరి అలా ఓ టాప్ కంటెస్టెంట్ గ్రాఫ్ మళ్ళీ తగ్గుతుందా అని ఆడియెన్స్ పల్స్ తో తెలుస్తుంది. అది మరెవరో కాదు సోహెలే.. సోహెల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఫినిష్ కంటెస్టెంట్స్ లో ఒకడు. ఒక్కసారి నాగ్ చెప్పడానికి తన యాటిట్యూడ్ మార్చుకొని కోపాన్ని తగ్గించుకున్న ఇతడు అనూహ్యంగా గ్రాఫ్ ను పెంచుకొని మేకర్స్ కు ఊహించని రెస్పాన్స్ నే ఇచ్చాడు.
కానీ లేటెస్ట్ గా అరియానా విషయంలో అతడు విచక్షణ కోల్పోవడం మళ్ళీ అంతా మొదటికే వచ్చేసింది. తప్పు ఎవరిది అయినప్పటికీ ఆడవాళ్ళ మీద సోహెల్ అంతలా అరవాలా? అన్న టాపికే నడుస్తుంది. దీనితో సోహెల్ చివరి సమయంలో తన గ్రాఫ్ ను కొద్దిగా కోల్పోయిన వాడయ్యాడు. మరి ఈ కొన్ని రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.
