బిగ్ బాస్ 4 – ఈ కంటెస్టెంట్ కు నిజంగా అంత క్రేజ్ ఉందా.?

BiggBoss4 1

ఇక ఈ వారం తో బిగ్ బాస్ సీజన్ 4 లో ఫైనల్స్ లో నిలిచే కంటెస్టెంట్స్ ఎవరు అన్నది ఖరారు అయ్యిపోతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ వారాంతం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతారని వీక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదే ఎలిమినేషన్స్ విషయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ వస్తున్న మోనాల్ గజ్జర్ పేరు కూడా అందరికీ వినిపిస్తుంది.

ఎందుకంటే ఎలిమినేషన్ ఉన్న ప్రతీసారి కూడా మోనాల్ ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతుంది అని అనుకునే వారికి అంతా షాకిస్తూ ఇప్పటి వరకు సేవ్ అవుతూనే వస్తుంది. ఇక సోషల్ మీడియా టాక్ కు వస్తే మాత్రం అసలు మోనాల్ ఇప్పటి వరకు ఉండాల్సిన కంటెస్టెంటే కాదని అనవసరంగా ఉంచుతున్నారని వీక్షకులు పెదవి విరుస్తున్నారు.

మరి ఇంతలా ఈమె నెట్టుకు రావడనికి అంత క్రేజ్ ఉందా అంటే దానికి సమాధానం దొరకడం కాస్త కష్టమే కానీ ఆమెకు కూడా అభిమానులు లేకపోలేరు. ప్రస్తుతానికి అయితే ఆమెకు ఏ స్థాయిలో యాంటీ ఫ్యాన్స్ ఉన్నారో అంతే స్థాయిలో సపోర్ట్ చేసే వారు కూడా ఉన్నారు. పైగా మధ్య మధ్యలో ఆమె గేమ్ కూడా మారడంతో గ్రాఫ్ పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. బహుశా అందుకే మోనాల్ ఇప్పటి వరకు నెట్టుకొచ్చేసింది. మరి ఈసారి ఎలిమినేషన్ లో ఏమవుతుందో చూడాలి.

Exit mobile version