ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అవుతున్నాయి. అక్కినేని నాగార్జున ‘ఢమరుకం’ మూడు సార్లు విడుదల తేదీ ప్రకటించి వాయిదా పడి చివరికి ఇటీవల నవంబర్ 23న విడుదలైన విషయం తెలిసిందే. ఆర్ధిక సమస్యల వల్ల ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఇదే వరసలో చిన్న సినిమాలు కూడా నడుస్తున్నాయి. నారా రోహిత్, నిత్య మీనన్ జంటగా నటించిన ‘ఒక్కడినే’ మొదటిగా డిసెంబర్ 7న విడుదల చేస్తామని ప్రకటించి డిసెంబర్ 14కి వాయిదా వేసారు. నాని, సమంతల ‘ఎటో వెళ్ళిపోయింది’ మనసు కూడా ఆర్ధిక సమస్యల వల్ల ఆగుతూ డిసెంబర్ 14న విడుదలకు సిద్ధమవుతుంది. ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి రూపొందించిన ‘జీనియస్’ సినిమా కూడా డిసెంబర్ 7 విడుదల ప్రకటించి డిసెంబర్ 21కి వాయిదా వేసారు. మంచు లక్ష్మి, ఆది, సందీప్ కిషన్, తాప్సీ కలిసి నటిస్తున్న గుండెల్లో గోదారి ఆడియో విడుదలై చాలా కాలమైనా సినిమా విడుదల విషయంలో ఇప్పటి వరకు ఇంత వరకు క్లారిటీ లేదు. సరైన ప్లానింగ్ లేకపోవడం, పెద్ద సినిమాలతో పోటీ పడడానికి వెనుకంజ వేయడం, ఆర్ధిక సమస్యలు ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
ఈ సినిమాలు ఇంతేనా?
ఈ సినిమాలు ఇంతేనా?
Published on Dec 2, 2012 6:44 PM IST
సంబంధిత సమాచారం
- ‘రాకా’లోకి ఎంటర్ కానున్న హాలీవుడ్ స్టార్?
- పోల్: వెంకటేష్-కళ్యాణ్ రామ్ మూవీకి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ ఎలా అనిపించింది?
- అభిమానికి రామ్ అభయం: అరుదైన వ్యాధితో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థిక, వైద్య సాయం!
- వెంకటేష్-కళ్యాణ్ రామ్ సంక్రాంతి మూవీ టైటిల్ ఫిక్స్: ఫన్నీ వీడియోతో ‘జనవరి 12 విడుదల’ అనౌన్స్మెంట్!
- మారుతిగా మారిన సంగీత్ శోభన్.. గ్లింప్స్ వచ్చేది ఆరోజే..!
- ‘ఇరుముడి’ కోసం రవితేజ ఇంకాస్త స్పీడ్ పెంచాల్సిందే..!
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- ‘టాక్సిక్’ తెలుగు గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ పూర్తి: సర్టిఫికెట్.. రన్టైమ్ డీటెయిల్స్!
- వీక్ డేస్ లో కూడా ఆగని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. స్ట్రాంగ్ బుకింగ్స్
- సాలిడ్ ఓపెనింగ్స్ దిశగా ‘ఇరుముడి’.. రవితేజ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- రూ.లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు: చెత్త సినిమా అంటూ ట్రోలింగ్.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం!
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- మెగాస్టార్ బర్త్ డే బ్లాస్ట్.. 158వ సినిమా టైటిల్ టీజర్ కి ఊహించని ప్లానింగ్!
- ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్.. ‘గాడ్ ఆఫ్ వార్’తో పాటు మరో క్రేజీ టైటిల్..?
- మళ్లీ సందడి చేయబోతున్న ఎవర్గ్రీన్ రొమాంటిక్ క్లాసిక్ ‘గీతాంజలి’


