మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “డ్రాగన్” కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి మేకర్స్ ముందు కొన్ని టైం లైన్ లు పెట్టుకున్నారు కానీ అవి సాధ్యమయ్యే ఛాన్స్ లేదని ఆల్రెడీ అర్ధం అయ్యింది.
ఈ ఏడాది రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ డేట్ లో కూడా ఈ ఏడాది సినిమా వచ్చే అవకాశం లేదనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాదే రిలీజ్ కి రానుంది. మరి ఈ కొత్త డేట్ గా ప్రస్తుతం మార్చ్ 7కి లాక్ చేసినట్టు తెలుస్తుంది. సో 2027 లో ఎన్టీఆర్, నీల్ ల బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రానుంది అని చెప్పొచ్చు. దీనిపై తారక్ బర్త్ డే రోజున ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.


