ఇళయ దళపతి విజయ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే జన నాయగన్. విజయ్ ఆఖరి సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమా విడుదల చేసేందుకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్న అభిమానులకి కూడా రిలీజ్ డేట్ పట్ల ఎలాంటి క్లారిటీ లేదు. కానీ తాజాగా తమిళ సినీ వర్గాల్లో మాత్రం సరికొత్త డేట్ ఒకటి ఇప్పుడు వైరల్ గా వినిపిస్తుంది.
ఈ సినిమా మే 8న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్టుగా టాక్. అక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సినిమా రానుంది అని తెలుస్తుంది. ఇంకోపక్క సూర్య నటించిన ‘కరుప్పు’ డేట్ మే 15 కూడా ఉందని బజ్ వినిపిస్తుంది. కానీ ప్రస్తుతం అయితే మే 8 రిలీజ్ డేట్ నే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వైరల్ గా మారింది. సో దీనిపై మేకర్స్ ఏమన్నా క్లారిటీ అందిస్తారో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.


