ఈవారం బిగ్ బాస్ నుండి ఆలేడీ కంటెస్టెంట్ అవుట్ అట

ఈవారం బిగ్ బాస్ నుండి ఆలేడీ కంటెస్టెంట్ అవుట్ అట

Published on Oct 19, 2019 8:30 AM IST

ఆసక్తిగా సాగుతున్న తెలుగు బిగ్ బాస్3 చివరి దశకు చేరుకుంది. ఇంకా కేవలం రెండు వారాలలో ఈ షో ముగియనుంది. దీనితో ఈ సారి టైటిల్ తో పాటు 50లక్షల ప్రైజ్ మనీ ఎవరు ఎగరేసుకుపోతారా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ లో ప్రస్తుతానికి మిగిలింది ఏడుగురు సభ్యులు మాత్రమే. వారిలో బాబా భాస్కర్,వరుణ్, రాహుల్, అలీ రెజా జెంట్ కంటెస్టెంట్స్ కాగా, శ్రీముఖి, వితిక, శివ జ్యోతి ఫీమేల్ కంటెస్టెంట్స్. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో ఏడుగురు సభ్యులు ఉండటంతో ఎవరు హౌస్ నుండి వెళ్లిపోనున్నారు అనేదానిపై ఆసక్తి నెలకొంది.

ఐతే ఇప్పటికే ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం ఓ లేడీ కంటెస్టెంట్ ఈ వారం షో నుండి ఎలిమినేట్ కానున్నారని సమాచారం. అనగా శ్రీముఖి, వితిక, శివ జ్యోతి లలో ఒకరు ఈ వారం సొంత ఇంటికి చేరనున్నారన్న మాట. ఎటొచ్చి శ్రీముఖి షో నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకనగా ఆమె టైటిల్ విన్నింగ్ ఫేవరెట్స్ లో ఒకరిగా ఉన్నారు కాబట్టి. ఇక శివ జ్యోతి లేదా వితిక లో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండగా, ఈ మధ్య తన ప్రవర్తన కారణంగా బాగా నెగెటీని మూటగట్టుకున్న వితిక ఎలిమినేట్ అవుతారని వినికిడి. మరి చూడాలి ఏమవుతుందో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు