“కల్కి 2898ఎడి” లో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

“కల్కి 2898ఎడి” లో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Published on Feb 25, 2024 1:00 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న వరల్డ్ లెవెల్ చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని గ్రాండ్ క్యాస్టింగ్ తో వేరే లెవెల్లో ప్లాన్ చేస్తుండగా లేటెస్ట్ గా వచ్చిన ఓ హింట్ అయితే కొన్ని ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ పై ఓ సూపర్ మాస్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారని టాక్ రాగా దీనిపై వామప్ కూడా చేస్తున్నట్టుగా ఓ బిట్ ట్యూన్ మేకర్స్ వినిపించారు.

అయితే అసలు ఈ ప్లాన్ ఇలాంటి ఒక సినిమాలో వర్కౌట్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా ఆసక్తికర ప్రశ్నగా మారింది. ఈ సినిమా వరల్డ్ లెవెల్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతుంది అది కూడా కమర్షియల్ కి భిన్నంగా సై ఫై ఫాంటసీ డ్రామాగా వస్తుంది. ఈ తరహా సినిమాలో అలాంటి మాస్ సాంగ్ అంటే చిన్నపాటి టెన్షన్ నెలకొంది. మరి ఈ టెన్షన్ ని దర్శకుడు బీబీగ్ స్క్రీన్స్ పై ఎలా మెప్పించే విధంగా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు