అక్కినేని హీరో సినిమా టైటిల్ ఇదేనా?

నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి డైరక్షన్ లో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. అలాగే మారుతితో మరో సినిమా చేస్తున్నాడు. శైలజ రెడ్డి అల్లుడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. ఈ రెండు సినిమాలో కాకుండా మరో కొత్త సినిమా ఒప్పుకున్నాడు ఈ హీరో. నిన్ను కోరి సినిమాతో మంచి విజయం సాధించిన డైరెక్టర్ శివ నిర్వాణతో సినిమా చెయ్యబోతున్నాడు చైతు.

నిన్ను కోరి తరహాలోనే ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరిగా తెరకేక్కబోతోంది. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతుండగా కోన వెంకట్ కథ స్క్రీన్ ప్లే అందించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో ఉన్న ఈ సినిమాలో సమంత నటించే అవకాశం ఉంది. ప్రేయసి అనే టైటిల్ ఈ సినిమాకు బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఏప్రిల్ రెండో వారంలో ఈ మూవీ ప్రారంభం కానుంది.

Exit mobile version