పవన్ – క్రిష్ ప్రాజెక్ట్ నుంచి ఈ అప్డేట్ వస్తుందా.?

Published on Mar 7, 2021 10:32 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం కూడా ఒకటి. మరి ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఓ బజ్ వినిపిస్తూ వస్తుంది. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మహాశివరాత్రి కానుకగా విడుదల చెయ్యడానికి మేకర్స్ ఫిక్స్ చేసిన సంగతి అధికారికంగా తెలిసిందే.

కానీ దీనితో పాటుగా పవన్ పై స్పెషల్ టీజర్ కూడా వస్తుంది అని నయా టాక్ మొదలయ్యి మరింత బలపడింది. అయితే దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడంతో ఆ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని మరో పక్క సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మాత్రం ఈ అప్డేట్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ వాతావరణమే నెలకొంది. మరి దీనిపై నిజంగా అప్డేట్ ఉంటుందా ఉండదా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :