RC 17: ఈసారి దేవిశ్రీ అందుకే దూరమా?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు తన కెరీర్ 17వ సినిమా స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ దర్శకుడు సుకుమార్ తో చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలు కావడానికి ముందే అభిమానులని కొన్ని రూమర్స్ ఇబ్బంది పెడుతున్నాయి.

అసలు సుకుమార్ సినిమాలు అంటేనే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇప్పటి వరకు వీరి కలయికలో ఒక్క సినిమా కూడా మిస్ కాలేదు. కానీ గత చిత్రం పుష్ప 2 కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనితో ఇపుడు రామ్ చరణ్ తో చేయనున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేయడం అనుమానమే అనే రూమర్స్ మరింత బలపడుతున్నాయి.

అయితే ఈ సినిమాకి దేవిశ్రీ వర్క్ చేయకపోవచ్చు అనే అంశానికి మరో బలమైన కారణం ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా కూడా పని చేస్తుండడం అట. ఎల్లమ్మ సినిమాపై పూర్తి దృష్టి కేంద్రీకరించే క్రమంలో సంగీత దర్శకునిగా కూడా చేస్తే మరింత ఆలస్యం అవ్వొచ్చు అనే కారణంగా దేవి దూరం కావచ్చని టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version