“వకీల్ సాబ్” టోటల్ రన్ టైం ఇంతా.?

“వకీల్ సాబ్” టోటల్ రన్ టైం ఇంతా.?

Published on Apr 3, 2021 10:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”, లాస్ట్ మినిట్ లో ఒక్కసారిగా భారీ హైప్ ను సెట్ చేసుకున్న పవన్ కం బ్యాక్ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్ ను ఓ లెవెల్లో జరుపుకుంటుంది. మరి ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లో మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ సినిమా విషయంలో బయటకు వస్తున్నాయి.

గత కొన్ని రోజులు నుంచి ఈ చిత్రం తాలుకా సెన్సార్ పూర్తయ్యిందని యూ/ఏ సర్టిఫికెట్ ఈ చిత్రం దక్కించుకుంది అని తెలిసింది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి మొత్తం రన్ టైం ఎంతో తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ కంటే ఎక్కువ సన్నివేశాలు యాడ్ చెయ్యడంతో 154 నిమిషాల నిడివి వచ్చిందట.

మరి శ్రీరామ్ ఈ చిత్రాన్ని ఎలా డీల్ చేసారో తెలియాలి అంటే వచ్చే 9వ తారీఖు వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో నివేతా థామస్, అనన్య నాగళ్ళ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు