‘టాక్సిక్’ ఓటిటి రేట్ మరింత పడిపోయిందా?

‘టాక్సిక్’ ఓటిటి రేట్ మరింత పడిపోయిందా?

Published on Oct 9, 2026 12:07 PM IST

ఈ ఏడాది భారీ అంచనాలు పెట్టుకొని విడుదలై అంతే డిజాస్టర్ అయ్యిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం ‘టాక్సిక్’ అనే చెప్పాలి. ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది కానీ సినిమా విడుదల అయ్యాక దారుణంగా డిజప్పాయింట్ చేసింది.

దీనితో ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర భారీ నష్టాలు మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా సెన్సేషనల్ సక్సెస్ సాధిస్తుందని నమ్మి విడుదలకి ముందు తాము చెప్పిన రేటు ఇస్తేనే ఓటిటి డీల్ లాక్ చేస్తామని మేకర్స్ కూర్చున్నారు. కానీ అది కాస్తా విడుదల అయ్యాక సినిమా అయ్యే సక్సెస్ బట్టి ముగిద్దాం అని చూసారు.

కానీ తేడా కొట్టేసరికి ఇప్పుడు వచ్చే ఆఫర్ కూడా తగ్గిపోయిందట. ఈ సినిమాని జీ 5 సొంతం చేసుకునే ఛాన్స్ ఉన్నట్టు రూమర్స్ వినిపించాయి. ఈ సినిమాకి 200 కోట్ల నుంచి 30 కోట్లకి డీల్ పడిపోయింది. కానీ ఇప్పుడు ఆ 30 కూడా లేనట్టు కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. సో టాక్సిక్ పరిస్థితి ఇలా మారింది. మరి ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో వస్తుందో లేదో వేచి చూడాలి మరి.

తాజా వార్తలు