పవన్ కోసం త్రివిక్రమ్ మరోసారి..?

Published on Oct 27, 2020 5:11 pm IST

మన టాలీవుడ్ లో కొన్ని ఆల్ టైం సాలిడ్ కాంబోలు కొన్ని ఉన్నాయి అలాంటి వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబో కూడా ఒకటి. వీరిద్దరిలో కాంబోలో వచ్చిన “జల్సా”, “అత్తారింటికి దారేది” సినిమాలు సెన్సేషన్ సృష్టించడంతో హ్యాట్రిక్ చిత్రం “అజ్ఞ్యాతవాసి” పై నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. కానీ సీన్ కట్ చేస్తే ఊహించని అనుభవాన్ని అభిమానులకు మిగిలింది.

అయినప్పటికీ త్రివిక్రమ్ మరియు పవన్ లకు మధ్యన ఉన్న బాండింగ్ కోసం అందరికీ తెలిసిందే. కానీ అక్కడ నుంచి వీరిద్దరి కాంబో మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితులు మళ్ళీ నెలకొనలేదు. కానీ ఇప్పుడు మాత్రం అది సాధ్యమయ్యేలా ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా అంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో అని కాదు జస్ట్ మాటలు మాత్రమే అందిస్తారని టాక్ సంతరించుకుంది.

లేటెస్ట్ గా పవన్ “అయ్యప్పనం కోషియం” రీమేక్ ను ఓకే చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహించనుండగా డైలాగులు మరియు రచనా సహకారం త్రివిక్రమ్ నుంచి ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పవన్ చేసిన “తీన్ మార్” చిత్రానికి త్రివిక్రమ్ తో పట్టుబట్టి మరీ పవన్ డైలాగులు రాయించుకున్నారు. ఒకవేళ ఇదే టాక్ కనుక నిజం అయ్యుంటే అప్పటి నుంచీ మళ్ళీ చేసే సినిమా ఇదే అవుతుంది.

సంబంధిత సమాచారం :