“సైంధవ్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

“సైంధవ్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on Jan 29, 2024 3:00 PM IST

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సైంధవ్” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ మరియు ఎమోషనల్ డ్రామా గా రిలీజ్ అయ్యింది కానీ ఈ చిత్రం థియేటర్స్ లో అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేదు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నట్టుగా బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

మరి ఈ బజ్ ప్రకారం ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ లోకి వస్తుంది అని టాక్. అయితే ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుకున్న సంగతి తెలిసిందే. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు