కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కీయారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, నయనతార ఇలా అనేకమంది హీరోయిన్స్ కలయికలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ సినిమానే టాక్సిక్. యష్ నుంచి ఎంతో కాలం తర్వాత వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఇపుడు విడుదల కాబోతోంది.
అయితే ఈ సినిమాకి ఏపీలో టికెట్ ధరల హైక్ ఉండొచ్చు అనే టాక్ ఇపుడు చర్చకు దారి తీసింది. అసలు తెలుగు ఇండస్ట్రీకి సంబంధం లేని సినిమా ఏపీలో షూట్ కూడా చేయని సినిమాకి హైక్ లు ఎందుకు అని సోషల్ మీడియాలో విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఇది ఒక రకంగా నిజమే.. అయినా కన్నడ లోనే హైక్ లు లేని సినిమాకి మన దగ్గర ఈ రకమైన వెసులుబాటు ఏంటో అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
