‘టాక్సిక్’కి దొరికిన గ్యాప్ లో మళ్ళీ ముందు ప్లాన్ కి వచ్చారా?

Toxic 2

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి ఇలా చాలా మంది హీరోయిన్స్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే “టాక్సిక్”. మంచి హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాని మేకర్స్ చివరి నిమిషంలో వాయిదా వేసి ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేశారు. అయితే ఈ సినిమాని చిత్ర యూనిట్ ఇప్పుడు దొరికే గ్యాప్ లో మళ్ళీ మొదటి ప్లానింగ్ కి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది.

తొలుత చిత్ర యూనిట్ ఈ సినిమాని పాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఇంటర్నేషనల్ ఆడియెన్స్ ని టార్గెట్ చేశారు. కానీ మొన్నటి వరకు మార్చ్ రిలీజ్ డేట్ కి ఫిక్స్ అయ్యి ఉన్న సమయంలో మాత్రం కేవలం పాన్ ఇండియా భాషల్లో మాత్రమే విడుదల చేస్తున్నట్టు వచ్చారు. కానీ ఇప్పుడు సమయం దొరకడంతో ఈసారి ప్రాపర్ ప్లానింగ్ తో ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version