రోల్ పర్ఫెక్షన్ కొరకు యంగ్ హీరో అలా చేస్తున్నాడా…?

రోల్ పర్ఫెక్షన్ కొరకు యంగ్ హీరో అలా చేస్తున్నాడా…?

Published on Oct 26, 2019 3:00 AM IST

adaavi

వైవిధ్యమైన చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు హీరో అడివి శేషు. ఆయన భిన్నమైన చిత్రాలు తీస్తూ వరుస హిట్లు అందుకుంటున్నారు. ఇటీవల ఆయన హీరోగా విడుదలైన ఎవరు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. లెక్కకుమించిన ఉత్కంఠ కలిగిలే మలుపులతో తెరకెక్కిన ఎవరు చిత్రం అద్భుత ఆదరణ చూరగొంది. కరెప్టెడ్ కన్నింగ్ పోలీస్ గా అడివి శేషు నటన హైలెట్ గా నిలవగా, రెజీనా కాసాండ్రా, నవీన్ చంద్ర, మురళి శర్మల నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.

కాగా ప్రస్తుతం మేజర్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నారు అడివి శేషు. 2008 ముంబై టెర్రర్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రన్ని సూపర్ స్టార్ మహేష్ నిర్మిస్తుండగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తన పాత్రలో పర్ఫెక్షన్ కొరకు అడివి శేషు కొందరు ఆర్మీ ఆఫీసర్స్ మరియు సి ఆర్ పి ఎఫ్ జవాన్లతో కలిసి వారి జాబ్ గురించి క్షుణ్ణంగా తెలుకుంటున్నాడట. వారితో అయన కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు