“పుష్ప 2” లో స్పెషల్ సాంగ్ కి ఈ యంగ్ సెన్సేషన్?

“పుష్ప 2” లో స్పెషల్ సాంగ్ కి ఈ యంగ్ సెన్సేషన్?

Published on Jan 17, 2024 9:43 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఎలాంటి కంగారు లేకుండా పక్కా ప్లానింగ్ ప్రకారం ఈసారి షూటింగ్ ని చేస్తున్నారు. అయితే ఈ చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ఇప్పుడు వినిపిస్తుంది.

గతంలో పుష్ప 1 కి గాను స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ సమంత మెరవగా ఇప్పుడు పార్ట్ 2 లో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ రీసెంట్ యంగ్ సెన్సేషన్ అయినటువంటి హీరోయిన్ శ్రీలీల ని లాక్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక శ్రీలీల డాన్స్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అదే డాన్స్ లో ఏ టు జెడ్ తెలిసిన బన్నీతో అయితే ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు