‘ఇస్మార్ట్ శంకర్’ రీరిలీజ్ అవుతుందా !

ismart

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం కమర్షియల్ సినిమా స్టామినాను ప్రూవ్ చేస్తూ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంతో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ ఇద్దరూ పరాజయాల పరంపర నుండి బయటపడ్డారు. ముఖ్యంగా పూరి. ఈ విజయం ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వరుసగా సినిమాల్ని ఓకే చేసుకుంటున్నారు.

ఇకపోతే ఈ నెల 28న పూరి పుట్టినరోజు. ఈ సందర్బంగా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల రీరిలీజ్ చేయడానికి పూరి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందట. ఈమేరకు డిస్ట్రిబ్యూషన్ వర్గాలతో చర్చలు జరుగుతున్నాయట. దీనిపై రేపో, ఎల్లుండో అధికార ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. పైగా పూరి పుట్టినరోజుకు సప్రైజ్ ఉంటుందని ఆయన నిర్మాణ సంస్థ వెల్లడించింది. బహుశా ఆ సప్రైజ్ ఇదే కావొచ్చు.

Exit mobile version