జాతరలా ‘ఇస్మార్ట్ శంకర్’ పబ్లిక్ ఈవెంట్

జాతరలా ‘ఇస్మార్ట్ శంకర్’ పబ్లిక్ ఈవెంట్

Published on Jul 5, 2019 2:09 AM IST

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ట్రైలర్, పాటలతోనే ఇది పక్కా హైదరాబాదీ పాతబస్తీ కుర్రాడి కథని క్లారిటీ వచ్చేసింది. అయితే సినిమాలో హైదరాబాద్ కల్చర్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి పూరి అండ్ టీమ్ విన్నూత్న ప్రయత్నం చేస్తున్నారు. చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను తెలంగాణ ప్రాంతంలోనే నిర్వహిస్తూ దానికి ‘ఇస్మార్ట్ బోనాలు’ అనే పేరు పెట్టారు. అంటే ఈ ఈవెంట్ ఒక జాతరలా జరుగుతుందని హింట్ ఇస్తున్నారు.

ఈ వేడుక ఈనెల 7వ తేదీ హన్మకొండలోని హయగ్రివాచారి గ్రౌండ్స్ వేదికగా జరగనుంది. దీనికి చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానున్నారు. నిన్ననే విడుదలైన ట్రైలర్ కూడా మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై హైప్ పెంచింది. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నాభ నటేష్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. ఈ నెల 18వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు