రిలీజై నేటికి ఏడాది….కానీ ఓటిటిలో రాని యంగ్ హీరో మూవీ

రిలీజై నేటికి ఏడాది….కానీ ఓటిటిలో రాని యంగ్ హీరో మూవీ

Published on Apr 28, 2024 2:04 AM IST

యువ నటుడు అఖిల్ అక్కినేని హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ సంస్థల పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గ్రాండ్ లెవెల్లో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్. ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా మోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేసారు. హిప్ హాప్ తమిళ, భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్ గా కనిపించారు.

కాగా గత ఏడాది సరిగ్గా ఇదే రోజున మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తరువాత నుండి ఈమూవీ యొక్క ఓటిటి రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆడియన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక నేటితో ఏజెంట్ రిలీజ్ అయి ఏడాది గడిచినప్పటికీ కూడా దీని ఓటిటి కి సంబంధించి క్లారిటీ లేదు. మరి రాబోయే రోజుల్లో అయినా మేకర్స్ ఓటిటి రిలీజ్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు