ఆ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లో సమంత.

ఆ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లో సమంత.

Published on Nov 28, 2019 4:28 PM IST

samantha

ఈ ఏడాది సమంత ఓ బేబీ తో బంపర్ హిట్ అందుకున్నారు. కొరియన్ మూవీ మిస్ గ్రాని కి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబట్టింది. అలాగే యూఎస్ లో వన్ మిలియన్ వసూళ్లు సాధించి ఆ ఘనత సాధించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. అలాగే సమంత శర్వానంద్ కు జోడిగా తమిళ చిత్రం 96 తెలుగు రీమేక్ లో నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ విడుదల అయ్యే అవకాశం కలదు.

కాగా సమంత ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నారని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. నేడు ఈ విషయంపై సమంత స్పష్టత ఇచ్చారు. నిజం గానే ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ కి తెలియజేశారు. మనోజ్ బాజ్పాయ్ నటించిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ కి కొనసాగింపుగా వస్తున్న ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాలలో అలరించిన సమంత వెబ్ సిరీస్ లో ఎలాంటి పాత్ర చేయనున్నారో అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు