దిగజారిపోయే నీచమైన మనుషులను పదే పదే చూడటం అసహ్యం – త్రిష

దిగజారిపోయే నీచమైన మనుషులను పదే పదే చూడటం అసహ్యం – త్రిష

Published on Feb 20, 2024 9:02 PM IST

ఇటీవల తన పై ఒక రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యల పై లీగల్ గా పోరాడేందుకు సిద్ధం అయ్యారు హీరోయిన్ త్రిష. విషయం ఏమిటంటే, అన్నాడీఎంకే నేత ఏవీ రాజు, సేలం వెస్ట్ ఎమ్మెల్యే వెంకటాచలం పై విమర్శలు చేస్తూ సడెన్‌గా హీరోయిన్ త్రిషపై దారుణమైన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు లీడర్‌ను విమర్శిస్తూ త్రిషకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

కాగా కొద్దిసేపటి క్రితం ఆ వ్యాఖ్యల పై తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా పరోక్షంగా స్పందించిన త్రిష, అటెన్షన్ పొందేందుకు ఏ స్థాయికైనా దిగజారిపోయే నీచమైన జీవితాలు మరియు నీచమైన మనుషులను పదే పదే చూడటం అసహ్యం. అటువంటి వారి పై నా న్యాయ విభాగం తగిన చర్యలు తీసుకుంటుంది అంటూ పోస్ట్ పెట్టారు. కాగా ఈ విధంగా తమ వ్యక్తిగత స్వార్ధం కోసం హీరోయిన్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పలువురు ప్రజలు సైతం ఏవి రాజు పై మండిపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు