
టాలీవుడ్ లో ఉన్న 6 అడుగుల మాచో హీరోస్ రానా కూడా ఒకరు.. చాలా మంది డైరెక్టర్స్ రాసుకునే డిఫరెంట్ రోల్స్ కి రానా బాగా సరిపోతాడు. అది లవర్ బాయ్ పాత్రైనా, విలన్ పాత్రైనా, యూత్‌ఫుల్ పాత్రైనా రానా పర్ఫెక్ట్ గా సరిపోతాడు.
రానా ప్రస్తుతం రెండు పీరియాడిక్ సినిమాల్లో నటిస్తున్నాడు. అవే ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ‘బాహుబలి’ లో రానా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా రానా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘విలన్ పాత్ర చేయాలనేది ప్రతి ఒక్క నటుని డ్రీం రోల్. నాకు బాహుబలి రూపంలో ఆ అవకాశం వచ్చింది. నేను రామాయణం, మహాభారతం చదివినప్పుడు కూడా ఎక్కువగా నెగటివ్ పాత్రలకే ఎక్కువ కనెక్ట్ అయ్యే వాడినని’ అన్నాడు. తను నటిస్తున్న ఈ రెండు సినిమాలు 2015లో విడుదలయ్యే అవకాశం ఉంది.

