నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు తన ఆల్ టైం బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయటపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా మోస్ట్ అవైటెడ్ అప్డేట్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్ లో అనేక సినిమాలు విడుదల తేదీలు ప్రకటించడంతో ఈ సినిమా మేకర్స్ కూడా అదిరిపోయే అప్డేట్స్ తో వచ్చారు.
మరి అలా ఫైనల్ గా ఈ హ్యాట్రిక్ కాంబో గర్జించేది ఎప్పుడో ఒక డేట్ ను ఫిక్స్ చేసేసారు. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి గాను మేకర్స్ మే 28వ తేదీని ఫిక్స్ చేసారు. సో నందమూరి ఫ్యాన్స్ ఆ డేట్ కు రచ్చ చెయ్యడానికి ఫిక్స్ అయ్యిపోవాలి ఇక. మరి పవర్ ఫుల్ మాస్ డ్రామాకు థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈసారి రాబోతున్న ఈ సెన్సేషనల్ కాంబో ఎలాంటి సాలిడ్ రికార్డులను నెలకొల్పుతుందో చూడాలి.
#BB3 Roar in theatres from May 28th, 2021????#BB3RoarOnMay28th#NBK106 #BalayyaBoyapati3#NandamuriBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/50wSkkkVit
— Dwaraka Creations (@dwarakacreation) January 31, 2021
