‘సరిలేరు నీకెవ్వరు’కు సెన్సార్ పూర్తయింది !

‘సరిలేరు నీకెవ్వరు’కు సెన్సార్ పూర్తయింది !

Published on Jan 2, 2020 6:36 PM IST

sarileru

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కలయికలో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. ఆర్మీ మేజర్‌ గా మహేష్ బాబు రోల్ సినిమాలోనే హైలైట్ అవుతుందట, ఆయన అభిమానులను ఆ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుందట. అలాగే ఈ సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆయన కామెడీ టైమింగ్ పూర్తిగా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

కాగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలకానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు