జబర్థస్త్ ఈజ్ బ్యాక్..!

Published on Jun 17, 2020 1:42 pm IST

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు జబర్థస్త్. కామెడీ షోలలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ షో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. వయసుతో సంబంధం లేకుండా ఏళ్లుగా హాస్యం పంచుతూ అందరికీ దగ్గరైన ఈ కామెడీ షో ద్వారా అనేక మంది స్టార్స్ గా ఎదిగారు. కాగా లాక్ డౌన్ కారణంగా ఈ షో షూటింగ్ నిలిచిపోయింది.

ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో పాటు, షూటింగ్స్ అనుమతులు ఇవ్వడంతో నేటి నుండి జబర్ధస్త్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. నానక్ రామ్ గుడాలోని రామానాయుడు స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జబర్దస్త్ షో షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. దీనితో హాస్యప్రియులను జబర్ధస్త్ టీం లీడర్స్ కొత్త ఎపిసోడ్స్ తో అలరించనున్నారు.

సంబంధిత సమాచారం :

More