హైదరాబాద్‌లో జరిగిన అనిరుధ్ రవిచందర్ లైవ్ కన్సర్ట్ అభిమానుల కేరింతల మధ్య అత్యంత ఉత్సాహంగా సాగింది. తనదైన శైలిలో రాక్ స్టార్ స్టేజ్‌పై ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. ఈ మ్యూజికల్ నైట్‌లో అనిరుధ్ తన పాపులర్ తెలుగు హిట్ సాంగ్స్‌ను ఆలపించగా, ప్రేక్షకులు ఊగిపోయారు.
అయితే, ఈ కన్సర్ట్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది మాత్రం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది పారడైజ్’లోని ‘జడల్’ సాంగ్. అనిరుధ్ ఈ పాటను పాడుతున్నప్పుడు హైదరాబాద్ ఆడియన్స్ నుండి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సాంగ్ పాడుతున్నంత సేపు స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.
అనిరుధ్ స్వయంగా స్వరపరిచిన ఈ ‘జడల్’ ట్రాక్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచి, అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తాజా కన్సర్ట్‌లో లభించిన రెస్పాన్స్‌ను చూస్తుంటే, ఈ సినిమా మ్యూజిక్‌పై ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతోంది. నాని-అనిరుధ్ కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ మ్యూజికల్ హిట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
