
‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్న యువహీరో నాగశౌర్య తాజాగా ‘జాదూగాడు’గా మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమౌతోంది. ఫస్ట్‌లుక్‌తోనే అంచనాలను పెంచేసిన ఈ సినిమా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలను మరింత పెంచేసింది.
తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల తేదీని ఖరారు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు సాగర్ మహతి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియోను ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. ‘చింతకాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనారిక బదోరియా కథానాయికగా నటించింది. సత్య ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకంపై వి.వి.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

