జగన్ అభిమానం పై బాలయ్య స్పందన !

జగన్ అభిమానం పై బాలయ్య స్పందన !

Published on Jun 7, 2020 12:45 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చిన్న‌ప్ప‌టి నుండి నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ వీరాభిమాని. క‌డ‌ప జిల్లా బాల‌య్య అభిమాన సంఘం అధ్య‌క్షుడి గా జగన్ ఉండే వారట. ఈ విషయం తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్యనే స్పష్టం చేశారు. మీకు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి వీరాభిమాని. మీకు తెలుసా? అని యాంకర్ అడగగా.. బాలయ్య సమాధానం ఇస్తూ.. ‘తెలుసు. కడప టౌన్‌ లోని నా అభిమాన సంఘానికి జగన్ ప్రెసిడెంట్‌. అయితే, రాజకీయాలు వేరు. సినిమాలు వేరు’ అని బాలయ్య తెలిపారు.

అయితే జగన్ అపట్లో తన తండ్రి టీడీపీతో పోరాటం చేస్తున్నా.. తాను మాత్రం నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలు అంటే ఎంత‌గానో ఇష్ట‌ప‌డేవారట. బాల‌కృష్ణ న‌టించిన సినిమా విడుద‌ల అయితే ప్ర‌తీ జిల్లాలో త‌ర‌హాలోనే క‌డ‌ప జిల్లాలో హంగామా బాధ్య‌త‌ల‌ను జ‌గ‌న్ తీసుకొనే వారట. అదే విధంగా ఆయ‌న ప‌త్రిక‌ల్లోనూ త‌న అభిమానాన్ని చాటుకుంటూ ప్ర‌త్యేకంగా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేవారట.

క‌డ‌ప జిల్లా బాల‌య్య అభిమాన సంఘం అధ్య‌క్షుడిగా 2000వ సంవ‌త్స‌రం ఆరంభంలో ఇచ్చిన ఒక ప్ర‌క‌ట‌న ఆ మధ్య సోష‌ల్ మీడియాలో బాగా హ‌ల్‌చ‌ల్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు