మహేష్ బాబు కజిన్ శివ హీరోగా ‘జగన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఈ రోజు విడుదల కావలసి వుండగా కొన్ని ఫైనాన్షియల్ కారణాల వల్ల వాయిదా పడింది. ఎప్పుడు విడుదల చేసేది ఈ రోజు ప్రకటించవచ్చు. మల్లికార్జున రావు – తోట హేమసుందర్ లు నిర్మించిన ఈ సినిమాకి వెంకన్నబాబు దర్శకత్వం వహించాడు.
శృతి రెడ్డి, సంజనా లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ – అమర్ మొహిలే సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పోస్టర్స్ లో హీరోను చూస్తుంటే వై.ఎస్. జగన్ పోలికలతో కనబడుతున్నాడు.


