మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం పెద్ది ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ సినిమాలో దర్శకుడు బుచ్చిబాబు సానా సాలిడ్ తారాగణం ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. విజయనగరం మాండలికంలో ప్లాన్ చేసుకున్న ఈ సాలిడ్ సబ్జెక్టులో ఒకొక్కరికి ఒకో పవర్ఫుల్ పాత్రని బుచ్చిబాబు డిజైన్ చేశారు.
అయితే వారిలో నటుడు జగపతి బాబు పోషించిన అప్పలసూరి కూడా ఒకటి. షాకింగ్ మేకోవర్ సినిమాలో పవర్ఫుల్ గా కనిపిస్తున్న ఈ పాత్ర పెద్ది కి అంకితం అయ్యిపోయింది అని జగపతి బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఈ సినిమాకి తన డబ్బింగ్ పనులు పూర్తి చేస్తున్నట్టుగా డబ్బింగ్ స్టూడియో నుంచి దర్శకుడు బుచ్చిబాబు సానా పర్యవేక్షణలో సాగిన వీడియోని పోస్ట్ చేసి ఇంట్రెస్టింగ్ లీక్ అందించారు.
దీనితో తన వీడియో పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు. అలాగే ఈ జూన్ 4న పాన్ ఇండియా లెవెల్లో సినిమా విడుదల కాబోతుంది.
#PEDDI ki ankitham ayyipoyina #Appalasoori. pic.twitter.com/mrVrKEG5HA
— Jaggu Bhai (@IamJagguBhai) May 26, 2026
