మరోసారి జగపతిబాబుని ఢీకొట్టనున్న మంచు మనోజ్..

manoj-jagapathi-babu
తెలుగు తెరపై కొత్త విలన్ గా జగపతి బాబు ఫిక్స్ అయ్యాడు. లెజెండ్, లింగా వంటి పెద్ద సినిమాలలో పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషించడమేకాక కరెంటు తీగ, పిల్లా నువ్వులేని జీవితం వంటి సినిమాలలో నెగిటివ్ షేడ్స్ వున్న కామెడీ రోల్ చేశాడు. ఇప్పుడు జగపతిబాబు ప్రతినాయకుడిగా మరోసారి మంచు మనోజ్ ని ఢీ కొట్టనున్నాడు.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్ ఒక ప్రాజెక్ట్ ని అంగీకరించిన విషయం తెలిసినదే. ఈ సినిమాకు ‘గొలుసు’ అనే టైటిల్ ని దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంకోసం జగపతిబాబుని ప్రతినాయిక పాత్రలో ఎంపిక చేసుకున్నారట. ఇప్పటికే మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణులతో సినిమాలు తీసిన రామూ మనోజ్ ని హీరోగా పెట్టి తీస్తున్న సినిమాతో మొత్తం మంచు ఫ్యామిలీని కవర్ చేసిన మొట్టమొదటి దర్శకుడిగా చరిత్రకెక్కాడు.

Exit mobile version