విడుదల తేదీ : జూలై 17, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : హ్రితిక శ్రీనివాస్, జగపతిబాబు, లయ, శ్రీనివాస్ అవసరాల తదితరులు
దర్శకత్వం : ఆకెళ్ల వి కృష్ణ
సంగీతం : కార్తిక్ బి కొడకండ్ల
నిర్మాత : కిషోర్ నాయుడు చిరు మామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్
ఛాయాగ్రహణం : చోటా కే నాయుడు
కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ చిత్రం “వదలా” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
మధ్యప్రదేశ్ లో ఓ డాక్టర్ గా పని చేసే యోగి సిద్ధార్థ్ (జగపతి బాబు) తన భార్య ప్రియ (లయ), వారి పిల్లలుతో ఒక అందమైన ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తాడు. అయితే ఓ యాక్సిడెంట్ ద్వారా పరిచయం అయ్యిన అమ్మాయి అముద (హ్రితిక శ్రీనివాస్) మొదట యోగి లైఫ్ లోకి వస్తుంది. అక్కడ నుంచి వీరి జీవితంలో ఆమె మూలాన ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అసలు ఈ అముద ఎవరు? ఎందుకు వీరి లైఫ్ లోకి వచ్చింది? ఆమెకి నివాస్ (శ్రీనివాస్ అవసరాల) కి సంబంధం ఏంటి అనేవి మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో మొదటగా చెప్పుకోవాల్సింది నటి హృతిక శ్రీనివాస్ కోసం అని చెప్పాలి. ఒక సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యిన యువతి పాత్రలో ఆమె చాలా బాగా చేసింది. ఒక పక్క లిమిటెడ్ గానే గ్లామర్ గా కనిపిస్తూ ఇంకోపక్క పెర్ఫార్మన్స్ పరంగా కూడా ఆమె ఇంప్రెష్ చేసింది.
అలాగే నటుడు జగపతి బాబు కూడా తన రోల్ లో బాగా చేశారు. డాక్టర్ గా తన ఫ్యామిలీ పట్ల ఎంతో అఫెక్షన్ కలిగిన తండ్రిగా బాగా చేశారు. తనతో పాటుగా లయ కూడా సాలిడ్ పెర్ఫార్మన్స్ చేశారు. ముందు అంతా తన రోల్ సింపుక్ గానే ఉన్నప్పటికీ క్లైమాక్స్ లో మాత్రం తన భర్త కోసం ఆరాటపడే భార్యగా ఎమోషనల్ పెర్ఫార్మన్స్ బాగా చేసారు. వీరితో రవి వర్మ పాటుగా ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా కేవలం దర్శకుని దృక్కోణంలో ఆలోచించే వారికే తప్ప ఇంకెవరికీ కనెక్ట్ కాదు. జగపతిబాబు, హ్రితిక శ్రీనివాస్ ల నడుమ సన్నివేశాలు వెంట్రుకవాసి అంత గ్యాప్ లో కొంచెం లవ్ అండ్ లస్ట్ ఎలిమెంట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం వీక్షకుడికి ఆకట్టుకునేలా అనిపించవు. కథనం పరంగా చాలా డిజప్పాయింటింగ్ అంశాలు ఉన్నాయి.
మొదట్లో విజయ్ సేతుపతి మహా రాజా స్టైల్ లో కొంత సేపు పర్వాలేదు అనిపిస్తుంది కానీ తర్వాత కథనం అంతా చాలా రొటీన్ అండ్ బోరింగ్ గా సాగుతుంది. దర్శకుడు తను అనుకున్న పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో జగపతి బాబుకు హృతిక నడుమ ఆ సాంగ్ ఎందుకు? అనిపిస్తుంది.
ముందు అంతా ఒక కోణంలో చూపించి చివరికి అందుకు పూర్తి విరుద్ధంగా ట్విస్ట్ లు ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఇలాంటి సున్నితమైన సబ్జెక్ట్ లో కథనాన్ని ఇంకా కేర్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. కానీ అది మిస్ అయ్యింది.
అలానే ఫస్టాఫ్ లో జగపతిబాబు బాబు, లయ నడుమ కొన్ని రొమాంటిక్ ట్రాక్ కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. అలాగే హృతిక పాత్ర వారి ఫ్యామిలీని అంత టార్చర్ చేసినప్పటికీ చిన్న ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ పెట్టి ఆమె ముందు చేసిన టార్చర్ ని సింపుల్ గా మర్చిపోయి ఆమె ఫోటో ఇంట్లో పెట్టుకోవడం ఏంటో అర్ధం కాదు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. అలాగే సినిమాలో సంగీతం మాత్రం బాగుంది. కార్తిక్ బి కొడకండ్ల మంచి పాటలు అందించారు. చోటా కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఆకెళ్ల వి కృష్ణ విషయానికి వస్తే తన వర్క్ మాత్రం డిజప్పాయింటింగ్ గానే అనిపిస్తుంది. చిన్న ఎమోషనల్ కోర్ పాయింట్ పట్టుకున్నారు కానీ దానిని ఎస్టాబ్లిష్ చేసిన తీరు మాత్రం డిజప్పాయింటింగ్ గానే ముగుస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకుంటే ఈ “వదలా” సినిమా ఒక బోరింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ గా నిలిచింది. కోర్ పాయింట్ కొంచెం ఓకే అనిపించినా మిగతా కథనం మాత్రం బోరింగ్ గా, డల్ గా అనిపిస్తుంది. నటన పరంగా హ్రితిక శ్రీనివాస్ మంచి పెర్ఫార్మన్స్ అందించింది. అలాగే లయ, జగపతిబాబులు కూడా మంచి సపోర్ట్ అందించారు కానీ కథనంలో పస లేనందున ఈ సినిమా ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team
