‘జై హనుమాన్’ : ఐమాక్స్ 3డి వర్షన్ లో కూడా

‘జై హనుమాన్’ : ఐమాక్స్ 3డి వర్షన్ లో కూడా

Published on Apr 23, 2024 2:38 PM IST

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మూవీ హను మాన్. ఈ మూవీలో తేజ సజ్జ హీరోగా నటించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా కనిపించారు. రిలీజ్ అనంతరం బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ భారీ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ కి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే.

ఇక ఇటీవల అనౌన్స్ మెంట్ పోస్టర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇక తమ మూవీని ఐమ్యాక్స్ 3డి వర్షన్ లో కూడా రిలీజ్ చేయనున్నట్లు నేడు హనుమజ్జయంతి సందర్భంగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక త్వరలో జై హనుమాన్ గురించి మరిన్ని వివరాలు ఒక్కొక్కక్కటిగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు