తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్ల వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ని రూపొందిస్తున్నారు.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2026 జూన్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, ఇప్పుడు తమ రిలీజ్ డేట్‌ను మార్చుకునేందుకు మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 14, 2026లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. జైలర్ చిత్రం కూడా 2023లో అదే తేదీన రిలీజ్ కావడం, ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో.. ఇప్పుడు సీక్వెల్‌ను కూడా అదే తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇక ఈ సినిమాలో విద్యా బాలన్ కీలక పాత్రలో నటిస్తుండగా మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ కేమియో పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్‌ను జనవరి కల్లా పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లా్న్ చేస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
