ఆ పండుగపై కన్నేసిన ‘జైలర్ 2’.. రిలీజ్ ఫిక్స్ అయ్యేనా..?

Jailer2

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే, చిత్రాన్ని తొలుత వేసవి బరిలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 10 లేదా 11వ తేదీన థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లాంగ్ వీకెండ్‌తో పాటు వినాయక చవితి పండుగను క్యాష్ చేసుకునేలా ఈ డేట్స్‌ను పరిశీలిస్తుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

మొదటి భాగం లాగే ఈ సీక్వెల్‌లో కూడా భారీ తారాగణం నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, ఎస్.జె.సూర్య, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version