సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ జైలర్ 2 కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా పట్ల కోలీవుడ్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే తమిళ్ తో పోలిస్తే మన దగ్గర కొంచెం తక్కువే కానీ ఈ సినిమా విషయంలో ఉన్న ఆ కాస్త బజ్ కూడా తెలుగు ఆడియెన్స్ లో తగ్గిపోయింది అని చెప్పవచ్చు.
తాజాగా ఈ సినిమాలో ఏపీలో టికెట్ ధరల హైక్స్ ఇవ్వడం అనేది దాదాపు ఎవరికీ నచ్చలేదు. అసలు తెలుగు ఆడియెన్స్ ని ఇంత అలుసుగా ఎందుకు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ఈ వార్త విన్న వారు అడగడం మానట్లేదు. అసలు ఒరిజినల్ తమిళనాడు లోనే స్టాండర్డ్ ధరతో సినిమా విడుదల అవుతుంటే మా దగ్గర ఎందుకు ఇలా చేస్తున్నారని సగటు తెలుగు సినిమా ప్రేమికుడు వాపోతున్నాడు. దీనితో జైలర్ 2 కి మాత్రం ఏపీలో దెబ్బ పడే అవకాశం ఉంది.
