‘రణబాలి’కి బిగ్ బూస్టప్!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా టాలెంటెడ్ యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన సాలిడ్ హిస్టారికల్ చిత్రమే ‘రణబాలి’. పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో విజయ్ నుంచి పూర్తిగా ఒక సరికొత్త షేడ్ తో రాబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కలిసి వచ్చింది అని చెప్పాలి. ఈ చిత్రంపై వచ్చిన టికెట్ ధరల హైక్స్ విషయాన్ని మేకర్స్ కొట్టిపడేసారు.

నిజాం, ఏపీ రెండు స్టేట్స్ లో కూడా ఎలాంటి హైక్స్ ఉండవని చెప్పేసారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే దీనితో పోటీలో ఉన్న జైలర్ 2 ఏపీలో హైక్స్ తో వస్తుంది. దీనితో ఆల్రెడీ జనంలో ఇంట్రెస్ట్ లు మారిపోయాయి. ఇక రణబాలి ధరలు అందుబాటులో కనిపిస్తుండడంతో ఇది మాత్రం మంచి బూస్టప్ గా కనిపిస్తుంది. సో విజయ్ చిత్రానికి రెండు తెలుగు స్టేట్స్ లో కూడా మంచి స్టార్ట్ పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. కానీ అల్టిమేట్ గా తెలుగు ప్రేక్షకులు ఏ సినిమాకి పట్టం కడతారు అనేది వేచి చూడాలి.

Exit mobile version