జనవరి 30న థియేటర్లలోకి ‘జమాన’.. సెన్సార్ పూర్తి

జనవరి 30న థియేటర్లలోకి ‘జమాన’.. సెన్సార్ పూర్తి

Published on Jan 24, 2026 7:01 AM IST

Jamana Telugu Movie

సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘జమాన’. భాస్కర్ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఏ’ (U/A) సర్టిఫికెట్ అందుకుంది. అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 30న ఎం.జి మూవీస్ ద్వారా అచ్చిబాబు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో, నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ కథను రూపొందించారు. ఆద్యంతం ఉత్కంఠభరితమైన ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ చిత్రంలో వినోదానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రముఖ ఎడిటర్ ఎం.ఆర్. వర్మ పనితనం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తేజస్వి అడప నిర్మించిన ఈ చిత్రంలో స్వాతి కశ్యప్, జారా ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకోగా, సినిమా కూడా ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తలు