
అల్లరి నరేష్ సినిమాలంటే కామెడీకి ఓ సరికొత్త బ్రాండ్. కామెడీని తనదైన స్టైల్లో ప్రెజెంట్ చేస్తూ మెప్పిస్తూ వచ్చిన నరేష్ గత కొద్దికొలంగా తనదైన సినిమా చేయలేకపోయారు. తాజాగా ఆయన హీరోగా నటించిన మరో కామెడీ సినిమా ‘జేమ్స్ బాండ్’ ఆ లోటును తీర్చే సినిమాగా ప్రచారం పొందుతూ వచ్చింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం పరిచయమయ్యారు.
గత రెండు వారాలుగా బాహుబలి సినిమా తప్ప మరో సినిమా విడుదల కాని నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్నిచోట్లా ఈ కామెడీకి మంచి స్పందనే లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి సాటిలైట్ రెవెన్యూ తెచ్చుకోవడం విశేషంగా కనిపిస్తోంది. జెమిని టీవీ జేమ్స్ బాండ్ సాటిలైట్ హక్కులను సుమారు 3.25కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జేమ్స్ బాండ్.. ‘నేను కాదు నా పెళ్ళాం’ అన్న ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సినిమాలో సాక్షి చౌదరి అల్లరి నరేష్‌ను ఇబ్బందుల్లో పడేసే భార్యగా నటించింది.

